సారథి న్యూస్, హైదరాబాద్: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ సంక్షేమ పథకాలు, సరికొత్త ఆవిష్కరణలతో దేశానికే దిక్సూచిలా మారిన తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రజలు సుదీర్ఘ, శాంతియుత పోరాటం ద్వారా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారని కొనియాడారు. ఆరేళ్ల కాలంలో రాష్ట్రం […]