న్యూఢిల్లీ: లాక్ డౌక్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఇవి కొన్నిసార్లు సానుకూలంగా ఉంటే.. మరికొన్ని ఆటగాళ్ల మధ్య విమర్శలకు తావిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్ మెన్ కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు. గతంలో తీసుకున్న ఓ ఫొటోను కోహ్లీ ఆదివారం ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దానికి స్పందించిన పీటర్సన్.. ‘నీ గడ్డం తీసేయ్ కోహ్లీ’ అంటూ […]