భోపాల్: ఇటీవల బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ ప్రొఫైల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది మార్చిలో బీజేపీలో చేరిన సింధియా తన ట్వీట్టర్ ప్రొఫైల్‌లో బీజేపీ పేరును తొలగించారు. దీంతో ఇప్పుడు ఆయన ప్రొఫైల్‌లో ‘పబ్లిక్ సర్వెంట్, క్రికెట్ ఇష్టం’ అని మాత్రమే ఉంది. అయితే శివరాజ్‌సింగ్ చౌహాన్ టీమ్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయని, అందుకే ఆయన పార్టీ పేరును తొలగించారనే రూమర్స్ వస్తున్నాయి. కాగా ఆ వార్తలను సింధియా ఖండించారు. అయితే […]