సారథి, వేములవాడ: అధికార పార్టీ నాయకుల భూకబ్జాల వ్యవహారాన్ని బయటకు తీస్తున్న జర్నలిస్ట్ రఘును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే జర్నలిజానికి విలువ లేకపోతే సామాన్య ప్రజలకు భద్రతే లేకుండా పోతుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాచరిక పోకడలు మంచిది కాదని హితవుపలికారు. ప్రజలు అధికార పార్టీల పోకడలను నిశితంగా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని […]