సారథి న్యూస్, నాగర్కర్నూల్: జిల్లాకు చెందిన 80 మంది విలేకరులకు రూ.ఐదువేల చొప్పున స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తన క్యాంపు ఆఫీసులో మంగళవారం అందజేశారు. కరోనా కష్టకాలంలోనూ జర్నలిస్టులు తమ వృత్తికి న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. అంతకుముందు తెలకపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, మార్కెట్ […]
జర్నలిస్టుల సేవలు అమోఘం సారథి న్యూస్, వనపర్తి: రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో జర్నలిస్టులు నిస్వార్థంతో ప్రజలను జాగృతం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వార్తల సేకరణలో ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లాలో జీరో కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో గ్రీన్ జోన్ గా రికార్డుకెక్కిందని గుర్తుచేశారు. కరోనా ప్రభావం అంతగా […]