సారథి న్యూస్, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీని శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎంఎల్ఏ సుంకే రవిశంకర్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుక్రోద్దీన్, తహసీల్దార్ కోమల్ రెడ్డి, […]