సారథి, చొప్పదండి: చొప్పదండి పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజభూమారెడ్డి గురువారం రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. చొప్పదండి మొట్టమొదటి సర్పంచ్ స్వర్గీయ గుర్రం చిన్నాఎల్లారెడ్డి ట్రస్ట్ వారు వాటిని సమకూర్చారు. పారిశుద్ధ్య కార్మికులు జాగ్రత్తలను పాటించి అనారోగ్యం బారినపడకుండా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కాట్నపల్లి మదన్ రెడ్డి, గుర్రం సుజిత్ రెడ్డి, కమిషనర్ అంజయ్య, కొత్తూరి నరేష్, మేనేజర్ ప్రశాంత్, హెల్త్ అసిస్టెంట్ మహేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.