సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో శుక్రవారం 7 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. గవ్వలపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రాగా, రుద్రారం గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మండలంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని […]