సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని పాత మొజంజాహి మార్కెట్ ను కూల్చివేసి నిర్మించిన మార్కెట్ సముదాయాన్ని మంత్రులు కె.తారకరామారావు, సబితాఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ సీఎం మహబూద్ అలీ శుక్రవారం ప్రారంభించారు. ఈ మార్కెట్‌ను 1933లో నిర్మించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే రాజాసింగ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.
– స్వీయ రక్షణే అందిరికీ సేఫ్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అనునిత్యం జాగ్రత్తగా ఉండాలని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ మెలిగితే చుట్టుపక్కల వారికి కూడా మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చాలా చోట్ల రెడ్ జోన్స్ ను ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో స్థానికంగానే ఉంటూ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదేనని అంటున్నారు. రెడ్ జోన్స్ నుంచి […]