మే 31వరకు కొనసాగింపు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు సారథి న్యూస్, న్యూఢిల్లీ: లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మూసివేసి ఉంటాయని స్పష్టం చేసింది. […]