సామాజిక సారథి, రామాయంపేట: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలను బుధవారం నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నికులాలకు కేటాయిస్తున్న సంక్షేమ పథకాలను గౌడ కులస్తులు కూడా కేటాయించాలని కోరారు. అలాగే దళితబంధు మాదిరిగా గౌడబంధు కూడా ప్రకటించాలని, గౌడ కులస్తులకు సబ్సిడీపై మోటారు సైకిళ్లను కేటాయించాలని వారు కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు […]