ఇది అన్నమయ్య కీర్తనలోని.. పదం దీన్ని మనం మాట్లాడే మన భాషకు వర్తింపజేస్తూ ముచ్చటిద్దాం. తేట తెలుగు.. మాట అటుంచితే వాటమైన తెలుగు కోసమే ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ప్రతిమాటకు అంటే ఏమిటి అని ఇంట్లోని కొత్త తరం పిల్లలు ప్రశ్నిస్తుంటే గుండెలో కెళుక్కుమంటోంది. భాషకు పట్టం కట్టాల్సిన తెలుగు లోగిళ్లు అది జీర్ణావస్థకు చేరుతున్నా ప్రమాదం మనకు కాదు అనుకుంటున్నారు. మన జాతి మనుగడకే ముప్పు వస్తుందని గుర్తించడం లేదు. అదో వృథా ప్రయాసలా భావిస్తున్నారు. […]