సారథి, సిద్దిపేట ప్రతినిధి: గంగిరెద్దులు, బేడ బుడిగజంగాల ఇండ్ల స్థలాలు కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె అశోక్ అధికారులను కోరారు. సోమవారం చేర్యాల తహసీల్ధార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామ శివారు రుద్రాయపల్లికి చెందిన గంగిరెద్దులు, బేడ బుడగజంగాల కులస్తులకు 1982లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సర్వే నం:740/ఏ/2లోని 2.22 ఎకరాల భూమి ఇండ్ల స్థలాలకు […]