సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామంలో ప్రముఖ సామాజికవేత్త పవన్ కుమార్ యాదవ్ తన సొంత ఖర్చు రూ.15లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు అన్నపూర్ణ, సర్పంచ్ స్వప్న కిషన్ రావు, ఎస్సై భగవంతురెడ్డి, గోపాల్, హరిగోపాల్, బాబు, జానీ తదితరులు పాల్గొన్నారు.