సారథి, జగిత్యాల రూరల్: లాక్ డౌన్ నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలం ధరూర్ గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి తనిఖీలు చేపడుతున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, లేదంటే ఏదైనా ముఖ్యమైన పనిఉంటే 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.