సారథి న్యూస్, వికారాబాద్: వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం మెట్లకుంటలో రూ.1.15 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీరోడ్డును మంగళవారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించడం ద్వారా అభివృద్ధి పనులకు సుమారు రూ.250 కోట్ల నిధులు వచ్చాయన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి దీటుగా కొడంగల్‌ను అభివృద్ధి చేస్తామనడం ఈ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రత్యేకశ్రద్ధ అర్థమవుతుందన్నారు. కొడంగల్ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.