ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. క్రికెట్ పై అప్పట్లో ఎలా ఉండేవాడో ఇప్పుడు అదే దృక్పథం, అంకితభావంతో ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అతనితో కలిసి పోటీపడడం తన అదృష్టమని చెప్పాడు. ‘చిన్నప్పటి నుంచి కోహ్లీ ఎదుగుదలను చూస్తున్నా. క్రికెట్ అంటే ప్రాణం పెడతాడు. నేను, అతను ఒకే తరంలో క్రికెట్ ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్న వయసులోనే మేమిద్దరం కలుసుకున్నాం. అప్పట్నించి ఓ […]