సారథి న్యూస్, ములుగు: జిల్లాలోని నూగూర్ వెంకటాపురం, వెంకటాపూర్, గోవిందరావుపేట, వాజేడు మండలాల్లోని కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీచేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ తరగతులను బోధించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో గెస్ట్ ప్యాకల్టీని తాత్కాలిక ప్రాతిపదికన నియమించి ఇంటర్ తరగతులను కొనసాగించేవారు. కానీ ఈ విద్యాసంవత్సరం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై 45 రోజులు గడిచినా ప్రభుత్వం […]