సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న బాధితులకు ఇంటివద్దకే ‘ఐసొలేషన్ కిట్’ను సరఫరా చేయాలని నిర్ణయించింది. చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10వేల మందికి పైగా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో తొలుత ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. రెండు మూడు రోజులు గడిచే సరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు […]