సారథి, హైదరాబాద్: హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఎంపీటీసీ సభ్యుల సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర నాయకులు, ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొని పలు తీర్మానాలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను కలిసి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి తమ సమస్యలను విన్నవించాలని, అన్ని జిల్లాల్లో కలెక్టర్ లకు వినతిపత్రం ఇవ్వాలని, ఆగస్టులో హైదరాబాద్ లో ఎంపీటీసీల సభ […]