సారథి న్యూస్, దేవరకద్ర: దేవరకద్ర వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూతో పాటు కండువా, స్వామివారి పంచెలకు వేలంపాట నిర్వహించారు. చాలామంది భక్తులు వేలంపాటలో పాల్గొని వాటిని కైవసం చేసుకున్నారు. అనంతరం వినాయకుడిని దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండరపల్లి వాగులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు, అర్చనలు […]