సాహితీ శిఖం శ్రీశ్రీ 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యారు. విప్లవకవి, సంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా సుప్రసిద్ధులు. శ్రీశ్రీ హేతువాది, నాస్తికుడు, మహాకవిగా విశేష గుర్తింపు పొందారు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో సుప్రసిద్ధమైంది. పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు 1910 ఏప్రిల్ 30న శ్రీశ్రీ జన్మించారు. 1910 సంవత్సరం […]