సామాజిక సారథి, వాజేడు: దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆర్థిక సహాయం అందజేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం అరుణాచలపురం గ్రామానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ రెండేళ్లుగా ఎర్రరక్తకణాలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యచికిత్సల కోసం రెండెకరాల భూమిని కూడా అమ్ముకున్నాడు. మూడు రోజుల క్రితం వరంగల్ లోని లలిత ఆర్థోపెడిక్ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లాడు. బిల్లు కట్టలేని పరిస్థితుల్లో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థను సంప్రదించాడు. స్పందించిన […]