బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అన్షుమన్ గైక్వాడ్ న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే టీ20 ప్రపంచకప్ జరగడం అనుమానమేనని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అన్షుమన్ గైక్వాడ్ అన్నాడు. ఈనెల 28న ఐసీసీ సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలన్నాడు. ఒకవేళ ఏవైనా కారణాలతో మెగా ఈవెంట్ వాయిదా పడితే.. ఐపీఎల్ కు మార్గం సుగమమవుతుందన్నాడు. ‘ఐపీఎల్‌కు విండో దొరికినా.. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఐపీఎల్ భవిష్యత్ అప్పుడే తేలుతుంది. […]