బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ పై చర్చ బీజేపీ, టీఎంసీ ఒక్కటేనని కాంగ్రెస్విమర్శలు న్యూఢిల్లీ: తృణమూల్కాంగ్రెస్అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం, మమతాబెనర్జీని అపర కుబేరుడు గౌతమ్ అదానీ కలిశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్‌లో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమం గురించి గురువారం కోల్‌కతాలో సీఎం మమతాబెనర్జీని కలిసి మాట్లాడినట్లు గౌతమ్ అదానీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. అంతే కాకుండా మమతా బెనర్జీని కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. […]