సారథి, కొల్లాపూర్: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో జిల్లా అడిషనల్కలెక్టర్ మనుచౌదరి, చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి, చంద్రశేఖరాచారి శుక్రవారం పట్టణంలోని 20వ వార్డులో మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. పట్టణ ప్రగతి పనులపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైద్యసిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.