సామాజిక సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో అభి హెల్ప్‌లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి సహకారంతో కొనసాగుతున్న అక్షర భారత్ విద్యాకార్యక్రమాన్ని మండల కోఆర్డినేటర్ కార్తీక్, గ్రామ కోఆర్డినేటర్ పాయం అజయ్ ఆదివారం ప్రారంభించారు. వయోజనులందరికీ విద్యను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్నాగలక్ష్మి, ఆశా కార్యకర్త సమ్మక్క, గ్రామస్తులు పాల్గొన్నారు.