- టీఆర్ఎస్, బీజేపీలకు నిబంధనలు వర్తించవా
- కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ఫైర్
సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ నేతల దోస్తానం ఢిల్లీలోనే కాదు, గల్ళీలో కూడా నడుస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ సీరియస్ అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరాలకు పర్మిషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. తమ పార్టీకి మాత్రం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ‘ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ లో 120 మందితో కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ క్యాంపు నిర్వహణకు పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొరగా అనుమతి నిరాకరించిందని ఆయన ట్విట్టర్ వేధికగా ఫైర్ అయ్యారు. 300 మందితో సంఘ్ నిర్వహించిన శిక్షణకు మాత్రం పర్మిషన్ ఇచ్చి ద్వంధ్వ నీతిని ప్రదర్శిస్తున్నారంటూ దయ్యబట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులకు అనుమతిచ్చిన సర్కార్ కాంగ్రెస్ శిక్షణ తరగతులకు ఎందుకు అనుమతి ఇవ్వందంటూ ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా పర్యటనకు అనుతి ఇచ్చారు కానీ, వారికీ లేని కొవిడ్ తమకు ఉందా అంటూ దుయ్యట్టారు.