Breaking News

అందరివాడు..

అందరివాడు..
  • అధిష్టానం మెచ్చినోడు..
  • బరి గీసి నిలిచినోడు..
  • ప్రజల మనసును గెలిచినోడు..
  • పేదల మన్ననలు పొందినోడు
  • ఆయనే ఆరూరి రమేష్​
  • ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం..

సామాజిక సారథి,వరంగల్ ప్రతినిధి: అధిష్టానం మెచ్చినోడు..బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు..పేదల మన్ననలు పొందినోడు..వెనకబడిన తరగతిలో పుట్టినోడు.. ఆయనే అరూరి రమేష్.. ప్రస్తుతం వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి  చేసుకున్న సందర్భంగా సామాజిక సారథి ప్రత్యేక కథనం..  నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ, ఆ స్థానం ఆయనకి ఊరికనే రాలే. ఎన్నో కష్టాలు అవమానాలు ఓటములు అన్నీ తట్టుకుని ఇప్పుడు రాష్ట్రంలోనే  ద్వితీయ మెజార్టీతో విమర్శకుల నోటికి తన పనితీరుతోనే సమాధానం చెప్పడం ఆయన నైజం. ఆయనే వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్.  ఆరూరి అంటే రాష్ట్రంలో పరిచయం అక్కర్లేదు. తన మార్కు పాలనతో  వర్ధన్నపేట ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు. ఆరూరికి ఆ  హోదా రాత్రికి రాత్రే రాలేదు,  కూటికి కూడా లేని ఒక వెలివాడల దళిత కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే కష్టాల కొలిమిలో పెరిగి ఒక స్వర్ణ పుష్పములా ఎదిగాడు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు స్థానికేతరుడు అన్న భ్రమలోంచి ఇప్పుడు ఆరూరి మా ఇంటి పెద్ద కొడుకు అని నియోజకవర్గ ప్రజల ప్రతిధ్వనై వినిపిస్తున్నాడు.

టీఆర్ఎస్​లో కొద్దికాలంలోనే..

అరూరి రమేష్​ టీఆర్ఎస్​లో చేరిన కొద్ది కాలంలోనే ఆపార్టీ అధినేత కేసీఆర్​ అభిమానాన్ని చూరగొన్నాడు.  2019 ఎన్నికల్లో  దాదాపు లక్ష మెజారిటీ సాధించాడు. సాయం కోసం వచ్చిన ప్రజలను ఏనాడూ నిరాశతో పంపలేదు. భౌగోళికంగా నియోజకవర్గ పరిధి అస్తవ్యస్తంగా ఉన్నా  ప్రజల ఒడిని మరువలేదు. ప్రజల కోసం ఆయన చేసిన కృషినే ఆయన్ని నిత్య విద్యార్థిగా ప్రజాక్షేత్రపు పాఠశాలలో అగ్రభాగాన నిలబెట్టింది.

తండ్రి పేరుతో ఫౌండేషన్​ ఏర్పాటు

 ఆర్థిక ఇబ్బందులతో  పేద విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేసి కూలీలుగా మారుతున్నరన్న విషయం గ్రహించి  అందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు మన బడి.. మన బాధ్యత  కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పనకు కృషి చేశారు. తన తండ్రి ఆరూరి ఘట్టమల్లు పేరిట ఘట్టమల్లు ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది పేద విద్యార్థులకు కోచింగ్ ఇప్పించి సొంత ఖర్చుతో మెటీరియల్ అందించిన ఏకైక ఎమ్మెల్యే ఆరూరినే ..

ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కార్యాలయాలు

 తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా నాలుగు మండలాల్లో తన కార్యాలయాలు కట్టి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలతో మమేకం  అయ్యాడు. రాష్ట్రంలోనే  అత్యధికంగా సీఎంఆర్​ఎఫ్​  చెక్కులు మంజూరీ ఇప్పించి కష్టాల్లో ఉన్న కార్యకర్తల ఇంట్లో వెలుగులు నింపారు.

ఉప ఎన్నికలో నిడమనూరు బాధ్యతులు

నాగార్జునసాగర్​ ఉప ఎన్నికల సందర్భంగా ఆరూరి రమేష్​కు నిడమనూరు మండలానికి ఉపఎన్నికల ఇన్​చార్జి గా బాధ్యతలు చేపట్టారు. ఆయన తన వ్యూహాలకు పదును పెట్టాడు.  చోటా మోటా లీడర్లను అందరినీ ప్రజాక్షేత్రంలో నిలిపారు. ప్రభుత్వ పథకాలే ప్రచారాస్త్రాలుగా ప్రతి ఇంటి గడప తొక్కారు.  పార్టీ తనకి అప్పగించిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేయడానికి  తాను కష్టపడుతూ తన చుట్టూ ఉన్న నాయకులకు ఆదర్శంగా నిలిచి, నాయకుడు అంటే నడిచేవాడు కాదు, నలుగురిని నడిపించేవాడు అని మరోసారి నిరూపించారు. కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్, సీఎంఆర్​ఎఫ్​  చెక్కులను లబ్ధిదారుల గడప గడపకూ వెళ్లి వారి యోగ క్షేమాలు స్వయంగా అడిగి మరీ తెలుసుకునే అంత మంచి  ఎమ్మెల్యే ఉండటం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు. ఇంత మంచి పరిపాలనా అందిస్తూ..ఉన్నతవిద్యావంతుదు దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయిన ఆరూరి త్వరలోనే అధినేత చేత మం(త్రి)పు స్వీట్లు తినిపిస్తారని ఆరూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.