సామాజిక సారథి, వైరా: అమెరికా విద్యాసంస్థ నుంచి ఖమ్మంజిల్లా వైరాకు చెందిన మేడా హర్షిత డాక్టరేట్(పీహెచ్ డీ) పట్టా అందుకుంది. నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీ అనే అమెరికా విద్యా సంస్థ నుంచి పారిశ్రామిక అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టభద్రురాలైంది. ఈనెల 10వ తేదీన యూనివర్సిటీ అధికారికంగా హర్షితను. పీహెచ్ డీ డిగ్రీతో సత్కరించింది. హర్షిత చేసిన పీహెచ్ డీలో కార్యకలాపాల పరిశోధన రంగంలో ఉంది. ప్రొఫెసర్ లారెన్ బి.డేవిస్ వద్ద హర్షిత పరిశోధన పూర్తి చేసింది. ప్రస్తుతం హర్షిత లిబర్టీ మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే యునైటెడ్ స్టేట్స్ ఫార్చ్యూన్ 100 కంపెనీకి అడ్వాన్స్ డ్ అనలిటిక్స్, మోడలింగ్ విభాగంలో సీనియర్ అనలిస్ట్ గా పనిచేస్తుంది.