సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందిరా నగర్ పోలింగ్ సెంటర్ ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్, జమున దంపతులు కమలాపూర్ 262 పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం హుజురాబాద్ మండలం కందుగుల జడ్పీ హైస్కూలులో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఇల్లంతకుంట శ్రీరాములపల్లిలో గొడవ చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం 224 బూత్ లో ఈవీఎం మెరాయింపుతో పోలింగ్ ఆలస్యమైంది. అయితే ఈ విషయంపై లైన్లో ఉన్న కొంతమంది ఓటర్లు వెనుదిరగడంతో అక్కడ గొడవ జరిగింది. ప్రస్తుతం నియోజకవర్గంలోని హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్ జరగుతుంది.
- October 30, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- పొలిటికల్
- by election
- ETALA
- huzurabad
- KARIMNAGAR
- ఈటల
- కరీంనగర్
- హుజూరాబాద్
- Comments Off on ఓటు వేసిన ఈటల దంపతులు