Breaking News

ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు కరోనా

ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు కరోనా
  • ఓ మంత్రి, ఇద్దరు ఎంపీలకు పాజిటివ్‌

సామాజిక సారథి, హైదరాబాద్‌: ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీల్లో ఒకరికి కరోనా సోకింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే దాదాపు నాలుగురోజుల పాటు అక్కడే ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ రంజిత్‌ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పడు తాజాగా ఎంపీ కేశవరావుకు కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. అయితే ప్రస్తుతం ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.