- నిజామాబాద్‌లో కుటుంబం ఆత్మహత్య
- వెనక ఎంపీ అరవింద్అనుచరులు
- 317 జీవోతో ఉద్యోగుల్లో అభద్రత
- కాంగ్రెస్‌నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల ఆకృత్యాలకు ఉద్యోగులు, జనం బలవుతున్నారని కాంగ్రెస్‌ప్రచార కమిటీ చైర్మన్‌మధుయాష్కీ మండిపడ్డారు. వనమా రాఘవేందర్ఎపిసోడ్ముగియక ముందే.. నిజామాబాద్‌లో మరో సంఘటన జరిగిందన్నారు. నిజామాబాద్‌లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలే కారణమన్నారు. ఎంపీ అరవింద్‌అండదండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ, టీఆర్‌ఎస్‌నేత హస్తం ఉందన్నారు. వడ్డీ వ్యాపారులును వెంటనే అరెస్ట్‌చేయాలన్నారు. కబ్జాలు ఎక్కువయ్యాయని, తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్‌చేయాలని డిమాండ్‌చేశారు. ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్‌బాధ్యత వహించాలన్నారు. పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని అరెస్ట్‌చేయడాన్ని మధుయాష్కీ ఖండించారు. జీవో 317 విషయంలో ఉపాధ్యాయులు ఆలోచించాలన్నారు. మీ గొంతులు కోస్తున్నది టీఆర్‌ఎస్‌ప్రభుత్వమని గుర్తించాలన్నారు. ఈసారి టీఆర్‌ఎస్‌ప్రభుత్వాన్ని పాతరేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులపై మధుయాష్కీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశ పడుతున్నారని విమర్శించారు. ఉద్యోగులు మేలుకోండి. మీవెంట కాంగ్రెస్‌పార్టీ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్‌కు మానవత్వం ఉంటే వెంటనే 317 జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌చేశారు.