Breaking News

పేదల కోసమే సహాయనిధి

పేదల కోసమే సహాయనిధి
  • ఎమ్మెల్యే ఆరూరి రమేష్​

సామాజిక సారథి, ఐనవోలు: ప్రైవేట్​ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే సీఎం సహాయనిధి లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలంలోని ఫున్నెలు, వనమాల కనిపర్తి గ్రామాల్లో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.11.32లక్షల చెక్కులను శనివారం అందజేశారు. అత్యవసర సమయంలో ప్రైవేట్​ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభాగ్యులు, నిరుపేదలకు అండగా నిలుస్తుందని, కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, ఐనవోలు ఎంపీపీ మధుమతి రవీందర్ రావు, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, జడ్పీ కోఆప్షన్ మెంబెర్ ఉస్మాన్ అలీ, దేవస్థానం చైర్మన్ మునిగాల సంపత్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజశేఖర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.