సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో 9మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 174 కి చేరింది. శుక్రవారం ఒకేరోజు కొత్తగా 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కేసులు పాజిటివ్ గా తేలాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,484కు చేరింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరు చొప్పున, సంగారెడ్డి జిల్లాలో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో మూడు, మహబూబ్ నగర్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. వివిధ ఆస్పత్రుల్లో 2,032 మంది చికిత్స పొందుతున్నారు.
- June 12, 2020
- Archive
- Top News
- హైదరాబాద్
- CAROONA
- TELANGANA
- జీహెచ్ఎంసీ
- హైదరాబాద్
- Comments Off on 9 మంది మృత్యువాత