సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్కేసుల నిర్ధారణ 80వేల మార్క్‌ను దాటింది. రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 80,751కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 10 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 637 కు చేరింది. కరోనా నుంచి తాజాగా 1,587 మంది డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి బారినపడి 57,586 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 389 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆదివారం 11,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,24,840 మందికి టెస్టులు చేశారు. తెలంగాణలో రికవరీ రేటు 71.31శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 68.78 శాతంగా నమోదైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్‌ను విడుదల చేసింది.