సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం కొత్తగా 1,982 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 12 మంది మృతి చెందారు. అయితే ఇప్పటివరకు మహమ్మారి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 627కు చేరింది. అయితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 79,495కు చేరింది. కొత్తగా 1,669 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 55,999గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 22,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 463 నిర్ధారణ అయ్యాయి. అలాగే మేడ్చల్ జిల్లా 141, రంగారెడ్డి జిల్లా 139, వరంగల్ అర్బన్ జిల్లా 71, కరీంనగర్ జిల్లా 96 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా 6,13,231 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. తాజాగా 22,925 మందికి పరీక్షలు చేశారు. తెలంగాణలో రికవరీ రేటు 70.44 శాతం ఉండగా, జాతీయస్థాయిలో రికవరీ రేటు 68.32శాతంగా నమోదైంది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్‌ను విడుదల చేసింది.
- August 9, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- COVID19 CASES
- HYDERABAD
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on 80వేలకు చేరువలో..