సారథి న్యూస్, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు టీపాస్ బీ పాస్ వెబ్ సైట్ ను రూపొందించామని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వివరించారు. సోమవారం ఆయన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తుదారుడు స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారని తెలిపారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. 600 గజాలలోపు ఇళ్లు, 100మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉండే గృహాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటేనే 21 రోజుల్లో అనుమతి ఇస్తారని స్పష్టం చేశారు. ఈ వెబ్ సైట్ ను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రూపొందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మహానగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పారిశ్రామికశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్తదితరులు పాల్గొన్నారు.
- November 16, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- BONTHU RAMMOHAN
- HYDERABAD
- KTR
- MAYOR
- TSBPASS
- టీఎస్‌బీపాస్
- మంత్రి కేటీఆర్
- మేయర్బొంతు రామ్మోహన్
- హైదరాబాద్
- Comments Off on 75 గజాల స్థలంలో ఇల్లుకు పర్మిషన్ అక్కర్లేదు