![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/carona-newww.jpeg?fit=678%2C381&ssl=1)
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 945 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు 55,794 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,75,702 కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,631మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. దీంతో వైరస్ను జయించిన వారి మొత్తం సంఖ్య 22,22,578 కు చేరింది. దేశంలో రికవరి రేటు కూడా గణనీయంగానే ఉన్నది. 74.30 శాతం మంది కరోనాతో కోలుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రతిరోజు అన్ని రాష్ట్రాల్లో కలిపి 10 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.