న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. గత 24 గంటల్లో 60 వేల కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులసంఖ్య 20,88,611కు చేరుకున్నది. ఇప్పటివరకు 42,518 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 14,27,005 మంది డిశ్చార్జి అయ్యారు. 6,19,088 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంట్లో 933 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈమేరక శనివారం కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని దవాఖానకు వెళ్లాలని కోరింది.
- August 8, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- HEALTH
- INDIA
- NEW
- PM MODI
- PRIMEMINISTER
- ఇండియా
- కొత్తకేసులు
- మహమ్మారి
- Comments Off on 60వేల కొత్త కేసులు