సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడ్డ 337 మంది జర్నలిస్టులకు రూ. 59 లక్షల 30 వేల రూపాయలు ఆర్థికసాయం అందించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన 256 మందికి 20 వేల రూపాయల చొప్పున, 51 లక్షల 20 వేల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున 8 లక్షల 10 వేల రూపాయలను అందిచామన్నారు. జర్నలిస్టులు ఎవరికైనా కరోనా సోకితే.. తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్ కి పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ ను 9676647807 నంబర్లో సంప్రదించవచ్చని చెప్పారు. కరోనా పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధ్రువీకరించిన మెడికల్ రిపోర్టులు పంపించాలని సూచించారు.
- July 27, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- HELP
- HYDERABAD
- JOURNALIST
- ఆర్థికసాయం
- కరోనా
- Comments Off on 337 మంది జర్నలిస్టులకు సాయం