Breaking News

3 రోజులు బయటికి రావొద్దు

3 రోజులు బయటికిరావొద్దు

హైదరాబాద్‌: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 1500 కాలనీల్లో నడుముల లోతు మేర వరద నీరు చేరింది. కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రహహిస్తుండడంతో అధికారులు బోట్లు, నాటుపడవల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కనీసం మూడు రోజుల వరకు నగరవాసులు బయటకు రావొద్దని హెచ్చరించారు.
అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ – 90001 13667, 97046 01866, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ శాఖ 94408 13750, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.