Breaking News

Day: June 5, 2020

అదే లాస్ట్​ చాన్స్​

న్యూఢిల్లీ: భారత్​లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. విదేశాలకు తరలించడంపై బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తమ ముందున్న చివరి ప్రత్యామ్నాయం అదేనని బోర్డు వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ తమ మొదటి ప్రాధాన్యం మాత్రం భారతే అని స్పష్టం చేశాయి. ‘మాకు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాం. క్రికెటర్ల ఆరోగ్యానికి ఇబ్బందులు లేకుండా ఉండి, ప్రభుత్వం అనుమతి ఇస్తే లీగ్ ఇక్కడే జరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించని పక్షంలో, సరైన విండో లభిస్తే […]

Read More

చచ్చిపోదామనుకున్నా..

న్యూఢిల్లీ: జట్టులో చోటు దక్కకపోవడం, సరైన ఫామ్​లో లేకపోవడంతో… దాదాపు రెండు నెలలు కుంగుబాటుకు లోనయ్యానని వెటరన్ బ్యాట్స్​మెన్​ రాబిన్ ఉతప్ప అన్నాడు. ఓ దశలో ఆత్మహత్య కూడా చేసుకుందామన్న ఆలోచనలు కూడా వచ్చాయన్నాడు. ‘నా కెరీర్​లో 2009 నుంచి 2011 వరకు రెండేళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. ఎప్పుడూ కుంగుబాటుతో బాధపడేవాడిని. క్రికెట్ గురించి ఆలోచించిన సందర్భాలు లేనేలేవు. ఎప్పుడూ ఆత్మహత్య ఆలోచనలే. నేను వెళ్తున్న దారి సరైందో కాదో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఓ […]

Read More

పాక్‌ కాల్పుల్లో జవాన్​ మృతి

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌ రజౌరి జిల్లా సందర్‌‌బన్‌లో గురువారం అర్ధరాత్రి పాకిస్తాన్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. పాకిస్తాన్‌ ఆర్మీ రాత్రి 10 :45 గంటలకు ఒక్కసారిగా కాల్పులకు దిగిందని అధికారులు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్‌ పూంచ్‌ జిల్లాల్లో కూడా కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ సమీపంలోని కిర్నీ సెక్టార్‌‌లో మోర్టార్‌‌లతో దాడి చేశారని, మన ఆర్మీ వారిని సమర్థంగా తిప్పికొట్టిందని […]

Read More

బ్రహ్మముహూర్తంలో ఏం చేయాలి

బ్రహ్మముహూర్తం(బ్రాహ్మీ ముహూర్తం) చాలా విలువైన కాలం.. మన పూర్వీకులు కాలాన్ని ఘడియల్లో లెక్కించేవారు. ఒక ఘడియకు ప్రస్తుత మన కాలమానం ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా రెండు ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అన్నమాట. పగలు, రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అని పిలుస్తుంటారు. ఒక అహోరాత్రంకు సంబంధించి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయన్నట మాట. సూర్యోదయానికి ముందు వచ్చే […]

Read More

పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

సారథి న్యూస్, వెల్దండ: వెల్దండ మేజర్​ పంచాయతీని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దాలని నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఎల్​.శ్రీధర్​ ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. గురువారం ఆయన వెల్దండ మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించారు. పక్కాగా పల్లె ప్రగతి పనులు చేపట్టాలని ఆదేశించారు. వానాకాలంలో నాటేందుకు హరితహారం మొక్కలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్​ పరిశీలించి బాగా జరుగుతున్నాయని కితాబిచ్చారు. కలెక్టర్​ వెంట స్థానిక సర్పంచ్​ యెన్నం భూపతిరెడ్డి, డీపీవో సురేష్​ […]

Read More