ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ముంబై: లాక్ డౌన్ తర్వాత రిథమ్ దొరికించుకోవడంలో బౌలర్లకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడానికి కనీసం ఎనిమిది వారాలైనా సమయం పడుతుందన్నాడు. సుదీర్ఘ విరామం నుంచి గాడిలో పడటానికి ప్లేయర్లు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నాడు. బౌలర్లు పూర్తిస్థాయిలో టెస్ట్‌లు ఆడాలంటే 8 నుంచి 12 వారాలు, వన్డేలకు 6 వీక్స్, టీ20లకు 5 నుంచి 6 వారాల సమయం […]
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ కైఫ్ న్యూఢిల్లీ: సరిగ్గా పనిచేసి ఉంటే ఆసీస్ మాజీ బ్యాట్స్‌మెన్ గ్రెగ్ చాపెల్.. టీమిండియాకు అత్యుత్తమ బ్యాటింగ్ కోచ్ అయి ఉండేవాడని మహ్మద్ కైఫ్ అన్నాడు. తన స్వయంకృతాపరాధం వల్లే పదేపదే తప్పులు చేస్తూ పేరును చెడగొట్టుకున్నాడన్నాడు. భారత్‌కు జాన్ రైట్ ఇచ్చిన వారసత్వాన్ని నిలబెట్టలేకపోయాడని విమర్శించాడు. ‘చాపెల్ రాగానే జట్టులో బేధాభిప్రాయాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాడు. గంగూలీని కెప్టెన్సీ నుంచి తీసేయడం, క్రమంగా టీమ్‌కు దూరం చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. […]
డిసెంబర్ 3 నుంచి బ్రిస్బేన్‌లో తొలి టెస్ట్ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత భారత్ క్రికెట్ జట్టు అతి పెద్ద టెస్ట్ సిరీస్‌కు రెడీ అవుతోంది. డిసెంబర్ 3 నుంచి ఆస్ర్టేలియాలో పర్యటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇండో–ఆసీస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ, క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) విడుదల చేశాయి. నాలుగు టెస్ట్‌ల్లో భాగంగా తొలి మ్యాచ్ బ్రిస్బేన్‌లో జరగనుంది. ఆసీస్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో నాలుగు మ్యాచ్‌లకు నాలుగు వేదికలను […]
ముంబై: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ఉంటుందా? ఉండదా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ అంశంపై నేడు ఐసీసీ కీలక సమావేశం జరుగబోతున్నది. మెగా ఈవెంట్ను రద్దు చేస్తారని కొందరు, వాయిదా వేస్తారని మరికొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవని ఐసీసీ కొట్టి పారేస్తున్నది. ఇప్పటికే 2021 ఎడిషన్ హక్కులు భారత్ వద్ద ఉండడం, దీనికితోడు పన్ను మినహాయింపు విషయంలో బీసీసీఐ, ఐసీసీకి మధ్య వివాదం ముదరడంతో ఎలాంటి నిర్ణయాలు వస్తాయోనని అందరూ ఆతృతగా […]
న్యూఢిల్లీ: భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక పదవిని చేపట్టనున్నారు. ఐవోసీ ఒలింపిక్ చానెల్ కమిషన్ మెంబర్‌గా బాత్రాను నియమించారు. ఐవోసీ సెషన్, ఐవోసీ ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ఐవోసీ అధ్యక్షుడికి ఈ కమిషన్ సలహాలు, సూచనలు ఇస్తుంది. గేమ్స్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తనకు మంచి బాధ్యతలు అప్పగించిన ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్కు బాత్రా కృతజ్ఞతలు […]
న్యూఢిల్లీ: తెలుగు కుర్రాడు, స్టార్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్.. ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డు రేస్లో నిలిచాడు. ఇతనితో పాటు మీరాబాయ్ చానూ, పూనమ్ యాదవ్ పేర్లను వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఈ ఏడాది పురస్కారాలకు సిఫారసు చేసింది. 2018 కామన్వెల్త్లో స్వర్ణం సాధించిన 23 ఏళ్ల రాహుల్.. జూనియర్ విభాగాల్లోనూ చాలా పతకాలు గెలిచాడు. రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్‌షిప్ సాధించాడు. అయితే క్రీడల్లో అత్యున్నత పురస్కారం ‘ఖేల్‌రత్న’ను 2018లోనే అందుకున్న మీరాబాయ్ను అర్జునకు ప్రతిపాదించడం […]
ముంబై: లాక్ డౌన్ కారణంగా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైనా.. ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ఎవరూ తగ్గడం లేదు. తమకు అనువైన ప్రదేశంలోనే, తమకు నచ్చిన రీతిలో ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. ప్రపంచ క్రికెటర్లలో బెస్ట్ ఫిజిక్, ఫిట్‌నెస్ ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కసరత్తులు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. అత్యుత్తమ దేహాదారుఢ్యం ఆయన సొంతం. దానిని కాపాడుకునేందుకు చాలా శ్రమిస్తాడు కూడా. అతన్ని చూసి చాలా మంది సహచరులు కూడా ఫిట్‌నెస్ మంత్రను […]
బోరుబావిలో పడ్డ బాలుడి మృతి 8:30 గంటలు శ్రమించిన రెస్క్యూ టీమ్ సారథి న్యూస్, మెదక్: బోరు బావి బాలుడిని మింగేసింది.. గుంతలో పడ్డ చిన్నారి విగతజీవిగా మారాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చాన్ పల్లి గ్రామానికి చెందిన భిక్షపతి పంట సాగుకోసం తన పొలంలో మంగళవారం రాత్రి బోరు వేయగా ఫెయిల్ అయింది. దీంతో బుధవారం పొలంలో మరో రెండుచోట్ల బోర్లు వేయించాడు. వాటిలో కూడా చుక్కనీరు […]