సారథి న్యూస్, నల్లగొండ: కనిపించని శత్రువైన కరోనాపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించడమే మార్గమన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఇతర ప్రజాప్రతినిధులు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. సూర్యాపేటకు మార్కెట్కు చేరడం మన దురదృష్టమన్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ మహమ్మారి నియంత్రణపై పౌష్టికారం, ఇతర జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన […]
వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, అప్పాజీపల్లి, చిన్న ఘనపూర్, మెదక్ మండలం మంబోజి పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ లో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర […]