‘ఏ’ గ్రేడ్ వరి క్వింటాలు మద్దతు ధర రూ.1835 ‘బీ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1815 సారథి న్యూస్, నాగర్ కర్నూల్: తెల్కపల్లి, పెద్దకొత్తపల్లి మండల కేంద్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్ తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని తేమ లేకుండా చూసుకోవాలన్నారు. ‘ఏ’ గ్రేడ్ వరి క్వింటాలు మద్దతు ధర రూ.1835, ‘బీ’ గ్రేడ్ ధాన్యానికి […]
జర్నలిస్టుల సేవలు అమోఘం సారథి న్యూస్, వనపర్తి: రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో జర్నలిస్టులు నిస్వార్థంతో ప్రజలను జాగృతం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వార్తల సేకరణలో ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లాలో జీరో కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో గ్రీన్ జోన్ గా రికార్డుకెక్కిందని గుర్తుచేశారు. కరోనా ప్రభావం అంతగా […]
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో… సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత భోజనాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ప్రతిఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని సూచించారు. సేవాభావంతో అన్నదానం చేస్తున్న టీచర్లను మంత్రి అభినందించారు.
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రతిఒక్కరూ ఇళ్లకే సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. సదరు కార్డుదారులు తమకు డబ్బులు వచ్చాయా.. లేదా? స్టేటస్ ఏమిటి అనే విషయాలను ttps://epos.telangana.gov.in/ePoS/DBTResponseStatusReport.html ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. రేషన్‌కార్డు, ఆధార్ నంబర్‌ను ఎంట్రీ చేసి చూసుకుని.. డ్రా చేసుకోవచ్చు. అయితే […]
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు… సారథి న్యూస్, వనపర్తి: కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మంగళవారం ఆయన వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి, సంగినేనిపల్లి, తూముకుంట, బొల్లారం, వీపనగండ్ల గ్రామాల ప్రజలతో మాట్లాడారు. ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకోవడం, నోటికి రుమాలు కట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సంగినేనిపల్లి గ్రామంలో పేద కుటుంబాలకు […]
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి రెండో దశ లాక్ డౌన్… సారథి న్యూస్, నల్లగొండ: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి రెండో దశ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలుచేయనున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రకటించారు. కరోనా(కోవిడ్–19) వ్యాప్తి నియంత్రణే లక్ష్యంగా లాక్ డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలుచేయడమే కాకుండా వాటిని ఎవరు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని రెడ్ జోన్లు, కంటైన్ మెంట్ ప్రాంతాల పరిధిలో […]
ఆంధ్రప్రదేశ్ సారథి న్యూస్, అమరావతి: లాక్ డౌన్ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుజరాత్ సీఎం విజయ్ రూపానీని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఫోన్ లో మాట్లాడారు. వసతి, భోజన సదుపాయాల విషయంలో అసౌకర్యాలు లేకుండా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గుజరాత్ సీఎం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.