సారథి న్యూస్, అమరావతి: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెన్షనర్లకు 50 శాతమే పెన్షన్ చెల్లించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన పిల్‌పై విచారణ ఈనెల 27వ తేదీకి వాయిదా పడింది. సగమే పెన్షన్ చెల్లింపునకు లేదా కోత విధించేందుకు ప్రభుత్వానికి ఉన్న చట్టపరమైన అధికారాలను కౌంటర్ పిటిషన్ ద్వారా తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఈనెల 23వ […]
సారథి న్యూస్, విజయవాడ: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ సోమవారం ట్విట్టర్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషకరమైన సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నా..’ అని పవన్ ట్వీట్ చేశారు.
సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, విలేకరులకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా విజృంభిస్తున్న వేళ కూలీలు, మేస్త్రీలు, రైతులు, కార్మికులు, హమాలీలు, డ్రైవర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే రెక్కాడితే గానీ డొక్కాడని బక్కజీవులకు పనులు దొరకడం లేదు. చాలా మంది తమ పనులకు తాత్కాలిక విరామం ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే సాధారణ రోజువారీ కూలీలు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెత్తిన పెద్ద బండరాయిని మోస్తూ.. మండు టెండలో బక్కచిక్కిన దేహంతో నడుస్తూ వెళ్తున్న ఓ పెద్దమనిషి సోమవారం […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ను పక్కాగా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇచ్చిన వెసులుబాటు సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా క్లస్టర్ ప్రాంతాల్లోని ప్రజల కదలికలపై పెట్రోలింగ్ పోలీసులు, నిఘా బృందాలు, స్థానికంగా పికెట్ లో ఉన్న సిబ్బందితో పాటు, డ్రోన్ కెమెరాలు వినియోగిస్తూ నిబంధనల […]
నిత్యావసర సరుకుల పంపిణీ సారథి న్యూస్, నాగర్కర్నూల్: లాక్ డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్, మిత్రమండలి సమకూర్చిన నిత్యావసర సరుకులను మరికల్ గ్రామంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పంపిణీ చేశారు. అలాగే ముష్టిపల్లి, నక్కలపల్లి, వెన్నచర్ల గ్రామాల్లో సరుకులను పంపిణీ చేశారు. కష్టకాలంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమని దాతలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
* బీఎస్ 6 వెహికిల్ తో పర్యావరణ పరిరక్షణ* ఏప్రిల్ 1నుంచి సరికొత్త ప్రమాణాలతో వాహనాలు సారథి న్యూస్, హైదరాబాద్: దేశంలో జానాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఏటా లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో కాలుష్యం కోరలు చాస్తోంది. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను నియంత్రించాలన్న లక్ష్యంతో దేశంలో తొలిసారిగా 1991లో పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల విడుదలపై పరిమితులు […]
లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి ఈఎంఐలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై బజాజ్ ఫైనాన్స్ కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. వచ్చేనెల 28వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈఎంఐలు చెల్లించాలని బెదిరించాలని జాజుల లింగంగౌడ్ అనే వ్యక్తి ఈ మెయిల్ ద్వారా హెచ్ఆర్సీకి ఫిర్యాదుచేశారు.