సారథి న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలతో వీడియో కాన్ఫరెస్స్ నిర్వహించారు. ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనన్నారు. కరోనా వైరస్‌ను అధిగమించేందుకు కొన్నిరోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా కారణంగా ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రై డే, ఈస్టర్ పండగలను ఇళ్లలోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు రంజాన్ […]
సారథి న్యూస్, రంగారెడ్డి: బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఫీడ్ ది నీడ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం హయత్ నగర్ డివిజన్ లోని ద్వారకామాయి నగర్, హైకోర్ట్ కాలనీ, సాయికాలనీలో పేదలు, వలస కూలీలకు సంబంధించి 150 కుటుంబాలకు కళ్లెం నవజీవన్ రెడ్డి సహకారంతో నిత్యావసర సరుకులు, బియ్యం ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి, పోచంపల్లి గిరిధర్, బండారి భాస్కర్, పండాల శ్రీధర్ […]
లాక్ డౌన్ మరింత కఠినతరం ప్రభుత్వ ఉద్యోగులకు కలర్ పాస్‌లు డీజీపీ మహేందర్ రెడ్డి సారథి న్యూస్, హైదరాబాద్: అడ్రస్ ప్రూఫ్ ఉంటేనే బయటికి రావాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. విధులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు రోజుకు ఒకటి చొప్పున ఆరు రోజులకు ఒక్కో కలర్ పాస్ చొప్పున ఇస్తామన్నారు. కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో సోమవారం ఆయన డీజీపీ ఆఫీసులో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అవసరమైన సరుకులు కొనడానికి మూడు కి.మీ. […]
సారథి న్యూస్, మెదక్: కష్టకాలంలో పేదల ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని మెదక్ అడిషనల్ ఎస్పీ నాగరాజు అన్నారు. లాక్ డౌన్ కారణంగా నిత్యావసర సరుకులు దొరక్క పేద కుటుంబాలకు చెందిన అనేక మంది అర్ధాకలితో రోజులు గడుపుతున్న విషయం గుర్తించిన మెదక్ జిల్లా పోలీస్ అధికారులు దాతల సహకారంతో నిత్యావసర సరుకులను సమకూర్చారు. సోమవారం మెదక్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్, హవేలి ఘన పూర్, మెదక్ రూరల్, కుల్చారం, పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో […]
సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నుంచి ప్రజలను కాపాడాలని శివ్వంపేట మండలం చాకిరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.
సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలోని ఊటుకుంట వద్ద మామిడి తోటలో నిద్రిస్తున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. లక్ష్మమ్మ, కుల్లాయప్ప దంపతులు తోటలో ఉండగా చిరుత ఒక్కసారిగా వచ్చి దాడిచేసింది. ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం పుట్టపర్తి సత్యసాయి జనరల్ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మమ్మ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి తిరుపతి రొయ్య ఆస్పత్రికి తరలించారు. ఈఘటనతో బుచ్చయ్యగారిపల్లి గ్రామస్తులు […]
సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మాజీ కమిషనర్ పదవీ కాలాన్ని అయిదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేసిన వ్యాజ్యంపై ఈ నెల 28న తుది విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. కమిషనర్ పదవి నుంచి తనను కావాలని తప్పించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డినెన్స్ అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ, టీడీపీ నేతలు కామినేని శ్రీనివాస్, […]
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సారథి న్యూస్, అమరావతి: కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మూడు వారాల్లోగా గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ ఆఫీసులకు వైఎస్సార్ సీపీ జెండా రంగులు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విధంగా చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. […]