సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఇంకా పెరుగుతూనే ఉంది. రోజుకు వందల సంఖ్య కేసులు నమోదవుతున్నాయి. గురువారం(24 గంటల్లో) 1,896 కరోనా పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 2,06,644కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 12 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,201 కు చేరింది. కరోనా నుంచి తాజాగా 2,067 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న బాధితులు 1,79,075 మంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 26,368 ఉన్నాయి. ప్రస్తుతం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న వారు 21,724 మంది ఉన్నారు. ఒకరోజులో 50,367 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 33,96,839 టెస్టులు చేశారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్లో పలు విషయాలను వెల్లడించింది.
- October 8, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ACTIVECASES
- GHMC
- HYDERABAD
- TELANGANA
- కరోనా పాజిటివ్
- జీహెచ్ఎంసీ
- తెలంగాణ
- యాక్టివ్ కేసులు
- హైదరాబాద్
- Comments Off on 2లక్షలు దాటిన కరోనా కేసులు