సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒకేరోజు 1018 పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు పాజిటివ్కేసులు 17,357 నమోదయ్యాయి. ఇప్పటివరకు యాక్టివ్కేసులు 9008 ఉన్నాయి. తాజాగా 8082 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి ఏడుగురు మృతి, ఇప్పటివరకు 267 మంది మృత్యువాతపడినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులిటెన్ను పేర్కొంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 881 కేసులు, రంగారెడ్డి 33, మేడ్చల్జిల్లాలో 36, మహబూబ్నగర్జిల్లాలో 10 చొప్పున పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి.
- July 1, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- HYDERABAD
- TELANGANA
- కరోనా
- జీహెచ్ఎంసీ
- తెలంగాణ
- Comments Off on 17వేల మార్క్ దాటిన కరోనా